ఓయోలో వాటా కొనుగోలుకు మైక్రోసాఫ్ట్‌ యత్నాలు!
close

Published : 31/07/2021 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓయోలో వాటా కొనుగోలుకు మైక్రోసాఫ్ట్‌ యత్నాలు!

దిల్లీ: ఆతిథ్య సంస్థ ఓయోలో వాటా కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓయో విలువను సుమారు రూ.67,000 కోట్లుగా (9 బిలియన్‌ డాలర్లు) పరిగణిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓయోలో ఎంత వాటాను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేయనుందనే వివరాలు బయటకు వెల్లడికాలేదు. ఓయో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లడానికి ముందుగానే ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.పబ్లిక్‌ ఇష్యూకు ఎప్పుడు వెళ్తామనేది ఓయో ఇంతవరకు వెల్లడించలేదు. వాటా కొనుగోలు లావాదేవీపై ఓయో, మైక్రోసాఫ్ట్‌ స్పందించేందుకు నిరాకరించాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని