రోలెక్స్‌ రింగ్స్‌ ఐపీఓకు 130 రెట్ల స్పందన
close

Published : 31/07/2021 04:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోలెక్స్‌ రింగ్స్‌ ఐపీఓకు 130 రెట్ల స్పందన

దిల్లీ: రోలెక్స్‌ రింగ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) విశేష రీతిలో 130.44 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 56,85,56 షేర్లను జారీ చేయనుండగా.. చివరి రోజైన శుక్రవారం దరఖాస్తు చేసుకునే సమయం ముగిసే నాటికి 74,16,00,096 షేర్లకు బిడ్‌లు దాఖలైనట్లు ఎన్‌ఎస్‌ఈ వద్ద లభ్యమవుతున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అర్హులైన సంస్థాగత కొనుగోలుదార్ల విభాగంలో 143.58 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 360.11 రెట్ల చొప్పున స్పందన లభించింది. చిన్న మదుపర్లు 24.49 రెట్లు అధికంగా షేర్లకు బిడ్‌లు దాఖలు చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని