సగానికి తగ్గిన భెల్‌ నష్టం
close

Published : 31/07/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సగానికి తగ్గిన భెల్‌ నష్టం

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో భెల్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.448.20 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2020-21 ఇదే త్రైమాసిక నష్టం రూ.893.14 కోట్లతో పోలిస్తే నష్టం దాదాపు సగానికి తగ్గింది. ఆదాయాలు పెరగడం ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం రూ.2,086.43 కోట్ల నుంచి రూ.2,966.77 కోట్లకు పెరిగింది. ‘సమీక్షా త్రైమాసికం ఆరంభంలో కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపినప్పటికీ.. క్రమక్రమంగా పుంజుకున్నామ’ని భెల్‌ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని