‘క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌’ ఉత్పత్తికి పోకర్ణ నూతన ప్లాంటు
close

Published : 31/07/2021 05:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌’ ఉత్పత్తికి పోకర్ణ నూతన ప్లాంటు

హైదరాబాద్‌ సమీపంలో రూ.500 కోట్లతో నిర్మాణం
నేడు ప్రారంభించనున్న తెలంగాణ మంత్రి కె.టి.రామారావు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజనీర్డ్‌ స్టోన్‌, గ్రానైట్‌ ఉత్పత్తుల కంపెనీ పోకర్ణ లిమిటెడ్‌ హైదరాబాద్‌ సమీపంలోని మేకగూడ గ్రామం వద్ద  ‘క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌’ ఉత్పత్తి చేసే నూతన కర్మాగారాన్ని నెలకొల్పింది. ఏడాదికి 9 మిలియన్‌ చదరపు అడుగుల ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ కర్మాగారాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.టి.రామారావు ప్రారంభించనున్నారు. దాదాపు 1.6 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంటు వల్ల ప్రత్యక్షంగా 500 ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి కలుగుతుందని సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ చంద్‌ జైన్‌ తెలిపారు. ఈ కర్మాగారంలో ఇటలీకి చెందిన అత్యాధునిక ‘బ్రెటన్‌స్టోన్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వెల్లడించారు. దీనివల్ల పోకర్ణకు ఉన్న క్వార్ట్జ్‌ సర్ఫేసెస్‌ ఉత్పత్తి సామర్థ్యం 1.50 కోట్ల చదరపు అడుగులకు పెరుగుతుందని వెల్లడించారు. పూర్తి సామర్థ్యం మేరకు ఈ కర్మాగారంలో ఉత్పత్తి చేయగలిగితే, రూ.400 కోట్ల వార్షిక టర్నోవర్‌ నమోదు చేయవచ్చని వివరించారు. ప్రధానంగా సూపర్‌ జంబో సైజ్‌ 346×200, జంబో సైజ్‌ 330×165 క్వార్ట్జ్‌ స్లాబులు ఉత్పత్తి చేయగలమని పేర్కొన్నారు. వీటి తయారీకి సహజ సిద్ధ క్వార్ట్జ్‌తో పాటు బైండింగ్‌ పాలీమర్‌, లోహ రహిత  పిగ్మెంట్లు వినియోగిస్తారు. ఈ శ్లాబులను వంటగదులు, బాత్‌రూముల్లో, మెట్లు, లిఫ్టులు.. తదితర ప్రదేశాల్లో వినియోగిస్తారు. ఫ్లోర్‌ టైల్‌్్సగా కూడా ఉపయోగించవచ్చు. ‘క్వాంట్రా’ అనే బ్రాండు పేరుతో శ్లాబులను పోకర్ణ లిమిటెడ్‌ విక్రయిస్తోంది. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాలకు క్వార్ట్జ్‌ శ్లాబులను ఎగుమతి చేస్తున్నారు. కాగా. పోకర్ణకు విశాఖపట్నంలోని అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లో ఇటువంటి కర్మాగారం ఇప్పటికే ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని