రాల్సన్‌ ఇండియా చేతికి డన్‌లప్‌ మార్కెటింగ్‌ హక్కులు
close

Published : 31/07/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాల్సన్‌ ఇండియా చేతికి డన్‌లప్‌ మార్కెటింగ్‌ హక్కులు

దిల్లీ: భారత్‌లో డన్‌లప్‌ బ్రాండ్‌ మార్కెటింగ్‌ హక్కులను టైర్ల తయారీ కంపెనీ రాల్సన్‌(ఇండియా) కొనుగోలు చేసింది. ద్వి, త్రిచక్ర విభాగాల్లో సూపర్‌ ప్రీమియం టైర్లు తీసుకురావాలని భావిస్తున్నట్లు లూథియానాకు చెందిన రాల్సన్‌ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 2,000కు పైగా డీలర్‌షిప్‌ల ద్వారా బైక్‌లు, స్కూటర్లు, మోపెడ్‌, త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్ల టైర్లను రాల్సన్‌ విక్రయిస్తోంది. తాజా ఒప్పందంతో ప్రీమియం ద్విచక్ర, త్రిచక్ర టైర్ల మార్కెట్‌లో తన స్థానాన్ని(ప్రస్తుతం 9) మరింత బలోపేతం చేసుకోగలమని రాల్సన్‌ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. తొలుత లూథియానాలోని తన తయారీ ప్లాంటు నుంచి డన్‌లప్‌ బ్రాండ్‌ టైర్లను తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ యోగేశ్వర్‌ శర్మ పేర్కొన్నారు. అంతక్రితం డన్‌లప్‌ మార్కెటింగ్‌ హక్కులు రూయా గ్రూప్‌ నియంత్రణలో ఉండేవి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని