త్వరలో నోయిడా విమానాశ్రయ నిర్మాణం
close

Published : 01/08/2021 03:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో నోయిడా విమానాశ్రయ నిర్మాణం

నోయిడా/లఖ్‌నవూ: నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి మరో అడుగు పడింది. జెవార్‌లోని 1334 హెక్టార్ల భూమిని అప్పగించడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన సంయుక్త సంస్థకు, స్విస్‌ డెవలపర్‌ అయిన జూరిచ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏజీకి చెందిన ప్రత్యేక కంపెనీకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌(ఎన్‌ఐఏఎల్‌), యమున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ల మధ్య ఈ ‘లైసెన్స్‌ మెమొరాండం’ కుదిరిందని ఒక అధికార ప్రకటన వెల్లడించింది. ‘తొలి దశలో 1,334 హెక్టార్లలో అభివృద్ధి చేపడతారు. రెండు రన్‌వేలుంటాయి. ప్రాథమికంగా 1.2 కోట్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యంతో ఇది రూపుదిద్దుకుంటుంది’ అని అధికార వర్గాలు తెలిపాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని