ఎన్‌టీపీసీ లాభంలో 17% వృద్ధి
close

Updated : 01/08/2021 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌టీపీసీ లాభంలో 17% వృద్ధి

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఎన్‌టీపీసీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 17 శాతం పెరిగి రూ.3,443.72 కోట్లకు చేరింది. కిందటేడాది ఇదే సమయంలో నికర లాభం రూ.2,948.94 కోట్లుగా నమోదైంది. అధిక ఆదాయాలు లాభంలో వృద్ధికి దోహదం చేశాయి. ఎన్‌టీపీసీ మొత్తం ఆదాయం రూ.26,794.68 కోట్ల నుంచి పెరిగి రూ.30,390.60 కోట్లకు చేరింది. అలాగే స్థూలంగా 71.73 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఎన్‌టీపీసీ ఉత్పత్తి చేసింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఇది 60.18 బిలియన్‌ యూనిట్లుగా ఉంది. దేశీయ విపణిలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్‌టీపీసీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని