3 రెట్లు పెరిగిన రెయిన్‌ ఇండస్ట్రీస్‌ లాభం
close

Published : 01/08/2021 03:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 రెట్లు పెరిగిన రెయిన్‌ ఇండస్ట్రీస్‌ లాభం

ఈనాడు, హైదరాబాద్‌: సిమెంటు, కాల్సినేటెడ్‌ పెట్‌ కోక్‌ (సీపీసీ) ఉత్పత్తి చేసే సంస్థ రెయిన్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఏడాది ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. త్రైమాసిక ఆదాయం రూ.3,622 కోట్లు, నికరలాభం రూ.241 కోట్లు నమోదయ్యాయి. ఈపీఎస్‌ రూ.7.18 ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,342 కోట్లు, నికరలాభం రూ.82 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పోలిస్తే నికరలాభం దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు అవుతోంది. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికానికి ఈ కంపెనీ రూ.2,990 కోట్ల ఆదాయాన్ని, రూ.215 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ఇతర కార్బన్‌ ఉత్పత్తుల (ఓసీపీ) ఆదాయం అధికంగా నమోదైంది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి రెయిన్‌ ఇండస్ట్రీస్‌కు 114.1 కోట్ల డాలర్ల స్థూల రుణభారం ఉంది. కంపెనీ వద్ద ఉన్న నగదును మినహాయిస్తే నికరంగా 91.8 కోట్ల డాలర్ల అప్పు ఉన్నట్లు అవుతుంది. ఈ రుణ చెల్లింపులు ప్రధానంగా 2025 జనవరి నుంచి మొదలవుతున్నాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి జూన్‌ వరకూ వివిధ ప్రదేశాల్లో ఉన్న యూనిట్లలో మూలధన అవసరాల కోసం 33 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని