గేమింగ్‌ ఉద్యోగాలపై మహిళల మక్కువ
close

Published : 01/08/2021 03:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గేమింగ్‌ ఉద్యోగాలపై మహిళల మక్కువ

హెచ్‌పీ ఇండియా గేమింగ్‌ సర్వే విశ్లేషణ

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో గేమింగ్‌ రంగంలో ఉద్యోగాలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ‘హెచ్‌పీ ఇండియా గేమింగ్‌ ల్యాండ్‌స్కేప్‌ రిపోర్ట్‌- 2021’ సర్వే విశ్లేషించింది. ‘గేమింగ్‌ ఉద్యోగాలను 84 శాతం మంది మహిళలు ఇష్టపడుతున్నారు. ఈ రంగంలో వృత్తిజీవితం (కేరీర్‌) నిర్మించుకోవాలనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మగవారిలో 82 శాతం మంది గేమింగ్‌ ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.’ అని ఈ నివేదిక విశ్లేషించింది.

* గేమింగ్‌ రంగంలో ఉద్యోగాలపై ఆసక్తి అధికంగా ఉన్న దక్షిణ భారత నగరాల్లో కోయంబత్తూర్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌, కోచి, చెన్నై, బెంగళూరు ఉన్నాయి.

* స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే పీసీ (పర్సనల్‌ కంప్యూటర్‌) పై గేములు ఆడటాన్ని 88 శాతం మంది ‘గేమర్లు’ ఇష్టపడుతున్నారు.

* గేమింగ్‌ పీసీ కొనుగోలు చేయడానికి రూ.1 లక్ష కంటే ఎక్కువ సొమ్ము వెచ్చించడానికి  తాము సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ భారతదేశానికి చెందిన యువతీ, యువకుల్లో 52 శాతం మంది స్పష్టం చేస్తున్నారు.

* పలు రకాల ఒత్తిళ్ల నుంచి బయట పడటానికి  కంప్యూటర్‌ గేములు ఆడటం ఒక మంచి మార్గమని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇందులో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు.

గత ఏడాదిన్నర కాలంలో కరోనా మహమ్మారి వల్ల అధిక సమయం ఇళ్లకే పరిమితం కావలసి వచ్చిన పరిస్థితుల్లో, ఎక్కువ మంది గేమింగ్‌ ద్వారా సాంత్వన పొందటాన్ని ఇష్టపడ్డారని హెచ్‌పీ ఇండియా పర్సనల్‌ సిస్టమ్స్‌ హెడ్‌ నితీష్‌ సింగల్‌ వివరించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ఆన్‌లైన్లో పలకరించేందుకు, యోగక్షేమాలు తెలుసుకునేందుకు పర్సనల్‌ కంప్యూటర్‌పై ఆధారపడినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని