త్వరలో పుణెలో కొవాగ్జిన్‌ ఉత్పత్తి
close

Published : 02/08/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో పుణెలో కొవాగ్జిన్‌ ఉత్పత్తి

పుణె: దేశంలో టీకాల కొరత ఒకవైపు, ఇంకా టీకాలు వేయించుకోవాల్సిన జనాభా ఎక్కువగా ఉండటం మరోవైపు ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇంకోవైపు మూడో దశ వస్తుందేమోననే భయాలు కూడా ఆందోళన పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పుణె సమీపంలోని మంజరిలో ఉన్న భారత్‌ బయోటెక్‌ అనుబంధ సంస్థ బయోవెట్‌ ఈ నెల చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి కొవాగ్జిన్‌ ఉత్పత్తిని ప్రారంభించబోతోందని అక్కడి జిల్లా యంత్రాంగం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో ప్రధానంగా వినియోగిస్తున్న రెండు టీకాల్లో కొవాగ్జిన్‌ ఒకటి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని