వాహనం.. రయ్‌.. రయ్‌
close

Published : 02/08/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహనం.. రయ్‌.. రయ్‌

 జులై అమ్మకాల్లో రెండంకెల వృద్ధి

దిల్లీ: వాహన కంపెనీలు అదరగొట్టాయి. జులైలో వాహనాల అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. దేశీయంగా ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం రావడం, కొనుగోలుదారు సెంటిమెంటు బలపడటం ఇందుకు దోహదం చేశాయి. సెమీకండకర్ల సరఫరా విషయంలో అవరోధాలు ఎదురైనప్పటికీ.. కొవిడ్‌-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు పెరిగేందుకు తోడ్పడింది. గత నెలలో మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాలు ఏకంగా 39 శాతం పెరగడం విశేషం. ఆల్టో, వ్యాగన్‌ ఆర్‌తో కూడిన మారుతీ మినీ కార్ల విభాగం అమ్మకాలు 19,685 వాహనాలకు పెరిగాయి. 2020 జూన్‌లో ఈ తరహా వాహనాల అమ్మకాలు 17,258గా నమోదయ్యాయి. స్విప్ట్‌, సెలేరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ లాంటి కాంపాక్ట్‌ కార్ల మొత్తం అమ్మకాలు 51,529 వాహనాల నుంచి 70,268 వాహనాలకు; విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎర్టిగాల అమ్మకాలు 19,177 వాహనాల నుంచి 32,272 వాహనాలకు పెరిగాయి. టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌, హోండా, ఎంజీ మోటార్‌ కూడా ఆకర్షణీయ పనితీరును కనబర్చాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని