ఈ నెలలో 5 ఫార్మా ఇష్యూలు
close

Published : 03/08/2021 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెలలో 5 ఫార్మా ఇష్యూలు

రూ.8,000 కోట్లకు పైగా సమీకరణ

ముంబయి: రాబోయే కొద్ది వారాల్లో పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు అయిదు ఫార్మా కంపెనీలు ముందుకు రానున్నాయి. ఇవి రూ.8,000 కోట్లకు పైగా నిధులను సమీకరించనున్నాయి. ఇందులో బెయిన్‌ క్యాపిటల్‌కు చెందిన ఎంక్యూర్‌ ఫార్మానే రూ.4,000 కోట్ల వరకు సమీకరించనుంది. విజయా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌(రూ.1500 కోట్లు), కృష్ణ డయాగ్నోస్టిక్స్‌(రూ.1200 కోట్లు), సుప్రియ లైఫ్‌ సైన్సెస్‌(రూ.1200 కోట్లు), విండ్‌లాస్‌ బయోటెక్‌(రూ.400 కోట్లు)లు కూడా ఇదే నెలలోనే ఇష్యూకు రానున్నాయి. ఈ అయిదు కంపెనీలు రూ.8300 కోట్ల మేర మీకరించనున్నాయని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు చెబుతున్నాయి. ఇందులో కృష్ణ డయాగ్నోస్టిక్స్‌ ఐపీఓ ఆగస్టు 4న మొదలై 6న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.933-954గా నిర్ణయించింది.

ఈ ఏడాదిలో రూ.70,000 కోట్లు!
స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో 12 కంపెనీలు కలిసి రూ.27,000 కోట్లకు పైగా సమీకరించాయి. అత్యధికంగా పవర్‌గ్రిడ్‌ ఇన్విట్‌ రూ.7735 కోట్లను సమీకరించింది. ఫార్మా కంపెనీలను పక్కనపెడితే.. దేవయానీ ఇంటర్నేషనల్‌, ఎక్సారో టైల్స్‌లు ఆగస్టు 4న ప్రారంభం కానుండగా.. నైకా(రూ.4,000 కోట్లు) పేటీఎమ్‌, మొబిక్విక్‌, పాలసీబజార్‌, కార్‌ట్రేడ్‌, డెలివరీలూ ఉన్నాయి. ఈ ఏడాదిలో మొత్తం మీద 40 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.70,000 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తున్నాయి.

మదుపర్ల ఆసక్తి
ఈ ఏడాదిలో మదుపర్ల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. తత్వ చింతన్‌ ఫార్మా, రోలెక్స్‌ రింగ్స్‌, జీఆర్‌ ఇన్‌ఫ్రా, క్లీన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, శ్యామ్‌ మెటాలిక్స్‌ అండ్‌ ఎనర్జీ, ఇండియా పెస్టిసైట్స్‌, దొడ్ల డెయిరీ, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌, జొమాటో పబ్లిక్‌ ఇష్యూలకు 29 నుంచి 180 రెట్ల స్పందన లభించడమే ఇందుకు నిదర్శనం. ఇక గతేడాది కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచీ బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ సూచీ ఆల్‌టైం గరిష్ఠాలకు వెళుతూనే ఉంది. ఇటీవలి ఫార్మా ఐపీఓలు కూడా రాణించాయి. రూ.2,144 కోట్ల కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఇష్యూ నమోదైనప్పటి నుంచి 45 శాతం వరకు లాభాలందించింది. ఇక జులై 29న ముగిసిన రూ.1,514 కోట్ల గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ ఇష్యూకు 2008 తర్వాత అత్యధిక రిటైల్‌ మదుపర్ల స్పందన లభించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని