15% పెరిగిన ఎయిర్‌టెల్‌ ఆదాయం
close

Updated : 04/08/2021 06:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15% పెరిగిన ఎయిర్‌టెల్‌ ఆదాయం

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేత్రైమాసికంలో ఏజీఆర్‌ బకాయిల కోసం భారీ మొత్తంలో కేటాయింపులు చేయడంతో సంస్థ రూ.15,993 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15.3% పెరిగి రూ.26,854 కోట్లకు చేరగా, త్రైమాసిక ప్రాతిపదికన 4.2% పెరిగింది. మార్చి త్రైమాసిక లాభం రూ.759.2 కోట్లతో పోలిస్తే 62% తగ్గింది. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయం (ఆర్పు) రూ.138 నుంచి రూ.146కు పెరిగింది. మార్చి త్రైమాసికంలో ఇది రూ.145గా నమోదైంది. ఒక్కో డేటా వినియోగదారు నెలకు సరాసరిన 18.5 జీబీల డేటా వినియోగించగా, 1,044 వాయిస్‌ కాల్స్‌ చేసినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారత ఆదాయాలు జూన్‌ త్రైమాసికంలో 19.2% పెరిగి రూ.18,828 కోట్లకు చేరాయి. మొబైల్‌ ఆదాయాలు కూడా 4జీ వినియోగదార్లు అధికంగా జత కావడంతో 21.9% పెరిగాయి. సమీక్షా త్రైమాసికంలో 51 లక్షల మంది 4జీ వినియోగదార్లు కొత్తగా చేరారు. డిజిటల్‌ టీవీ వ్యాపారం 8.7 శాతం మేర పెరిగింది. 16 దేశాల్లో కలిపి ఎయిర్‌టెల్‌కు సుమారు 47.4 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని