77% పెరిగిన అదానీ పోర్ట్స్‌ లాభం
close

Updated : 04/08/2021 06:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

77% పెరిగిన అదానీ పోర్ట్స్‌ లాభం

దిల్లీ: అదానీ పోర్ట్స్‌ ఏప్రిల్‌-జూన్‌లో రూ.1,341.69 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆర్జించిన రూ.757.83 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 77.04% అధికం. మొత్తం ఆదాయం రూ.2,749.46 కోట్ల నుంచి రూ.4,938.43 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ.1,805.24 కోట్ల నుంచి రూ.3,464.88 కోట్లకు చేరాయి. విలీనం సహా గంగవరం పోర్టును ఏపీఎస్‌ఈడ్‌తో ఏకీకృతం చేసే అంశాన్ని పరిశీలించేందుకు స్వతంత్ర డైరెక్టర్లతో కమిటీని సంస్థ నియమించింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లాభం రూ.266 కోట్లు

జూన్‌ త్రైమాసికంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.265.50 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.65.67 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.5,265.19 కోట్ల నుంచి రూ.12,578.77 కోట్లకు పెరిగింది. ‘అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అదానీ గ్రూప్‌ మొత్తానికీ ఇంక్యుబేషన్‌ ఇంజిన్‌లా ఉంటుంది. అనేక కొత్త వ్యాపారాల సృష్టి వేగవంతం అవుతూనే ఉంద’ని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని