జీఎంఆర్‌ ఏరోసిటీలో కో-లివింగ్‌ ప్రాజెక్టు
close

Published : 05/08/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎంఆర్‌ ఏరోసిటీలో కో-లివింగ్‌ ప్రాజెక్టు

రూ.250 కోట్ల పెట్టుబడితో నిర్మాణం

బోస్టన్‌ లివింగ్‌’తో ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూపునకు చెందిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలోని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోసిటీలో కో-లివింగ్‌ సదుపాయం ఏర్పాటు కానుంది. దీనివల్ల హైదరాబాద్‌ నగరానికి దక్షిణ ప్రాంతంలో వివిధ సంస్థల్లో పనిచేసే యువ ఉద్యోగులకు నాణ్యమైన అద్దె- నివాస సదుపాయం లభిస్తుందని సంస్థ పేర్కొంది. ఇన్‌కార్‌ గ్రూపునకు చెందిన బోస్టన్‌ లిమిటెడ్‌ అనే సంస్థ జీఎంఆర్‌ ఏరోసిటీలో కో-లివింగ్‌, సర్వీస్డ్‌ రెసిడెన్సెస్‌ ప్రాజెక్టు నిర్మించబోతోంది. దాదాపు 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉండేలా ఈ నివాస సదుపాయాన్ని ‘ద ల్యాండింగ్‌ బై బోస్టన్‌ లివింగ్‌’ అనే పేరుతో చేపట్టనున్నారు. దశల వారీగా దాదాపు 1500 పడకలు అందుబాటులోకి వస్తాయి. మొదటి దశ 2022 చివరికి పూర్తవుతుంది. ఈ మేరకు బోస్టన్‌ లివింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్యా సూర్నేని, జీఎంఆర్‌ గ్రూపు సీఈఓ (ఎయిర్‌పోర్ట్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌) అమన్‌ కపూర్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుపై రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు బోస్టన్‌ లివింగ్‌ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మిస్తామని ఆదిత్యా సూర్నేని తెలిపారు. దీనికి ‘అస్సెట్‌ మేనేజర్‌’ గా ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘అస్సెట్‌మాంక్‌’ వ్యవహరిస్తుందని అన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని