సెన్సెక్స్‌ @ 54,000
close

Published : 05/08/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెన్సెక్స్‌ @ 54,000

సరికొత్త రికార్డు ముగింపు

ఇదే బాటలోనే నిఫ్టీ

బుల్‌ పరుగు ఆగలేదు. సూచీల జోరు బుధవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు తాజా జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలకు తోడు అంతర్జాతీయ సానుకూల పరిమాణాలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ తొలిసారిగా 54,000 పాయింట్ల మార్కును అధిగమించడమే కాకుండా, ఈ స్థాయి కంటే పైనే ముగియడం విశేషం. నిఫ్టీ ఇంట్రాడేలో 16,290.20 పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ సూచీలకొస్తే ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌ లాభపడగా, టోక్యో సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 54,071.22 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో 54,465.91 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. ఒక దశలో 54,034.31 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసినా చివరకు 546.41 పాయింట్ల లాభంతో 54,369.77 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 128.05 పాయింట్లు లాభపడి 16,258.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,290.20-16,176.15 పాయింట్ల మధ్య కదలాడింది.

* డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 9 పైసలు లాభపడి 74.19 వద్ద 5 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ 4.77%, కోటక్‌ బ్యాంక్‌ 3.74%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.58%, ఎస్‌బీఐ 2.37%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.12%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.04%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.06% చొప్పున పెరిగాయి.

* టైటన్‌ 2.14%, మారుతీ 1.31%, నెస్లే ఇండియా 1.3%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.24%, సన్‌ ఫార్మా 1.16%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.03% మేర నష్టపోయాయి.

* బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, విద్యుత్‌ సూచీలు 2.6 శాతం వరకు రాణించాయి. టెలికాం, స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువుల సూచీలు డీలా పడ్డాయి.

* బీఎస్‌ఈలో 1,086 షేర్లు సానుకూలంగా, 2,176 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. 110 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఆర్‌బీఐ సమీక్షపై దృష్టి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. రేపు విధాన నిర్ణయాలను ప్రకటిస్తారు. మదుపర్లు ఈ నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని