సరికొత్త శిఖరాలకు సూచీలు
close

Published : 06/08/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త శిఖరాలకు సూచీలు

సమీక్ష

రుసగా నాలుగో రోజూ లాభాల్లోనే ముగిసిన సూచీలు, సరికొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెలువడనుండటంతో, ఐటీ, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు దిగారు. సెన్సెక్స్‌ చివరకు 123.07 పాయింట్ల లాభంతో 54,492.84 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డుతో ముగిసింది. నిఫ్టీ 50 సైతం 35.80 పాయింట్లు లాభపడి సరికొత్త రికార్డు ముగింపు 16,294.60 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 2 పైసలు లాభపడి 74.17 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 4.30%, ఐటీసీ 3.14%, టెక్‌ మహీంద్రా 2.55%, టాటా స్టీల్‌ 2.15%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.93%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.42%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.41%, కోటక్‌ బ్యాంక్‌ 1.31% చొప్పున పెరిగాయి. ఎస్‌బీఐ 3.33%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.13%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.78%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.77%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.36%, మేర నష్టపోయాయి. నీ వొడాఫోన్‌ ఐడియా బాధ్యతల నుంచి కుమార మంగళం బిర్లా వైదొలగడంతో బీఎస్‌ఈలో షేరు గురువారం ఒక దశలో 24 శాతానికి పైగా నష్టపోయి, 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.4.55కి చేరింది. తరవాత కోలుకుని 1.49 శాతం నష్టంతో రూ.5.94 వద్ద ముగిసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని