Yamaha: యమహా హైబ్రిడ్‌ స్కూటర్లు ప్రారంభ ధర రూ.76,830
close

Updated : 08/09/2021 09:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Yamaha: యమహా హైబ్రిడ్‌ స్కూటర్లు ప్రారంభ ధర రూ.76,830

దిల్లీ: ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) దేశీయంగా 2 హైబ్రిడ్‌ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. వీటి ప్రారంభ ధర రూ.76,830 (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). రే జడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌, స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ వేరియంట్లు 125 సీసీ ఇంజిన్‌, 8.2 పీఎస్‌ పవర్‌తో రూపొందాయి. వీటిలో స్మార్ట్‌ మోటార్‌ జనరేటర్‌ (ఎస్‌ఎంజీ) వ్యవస్థ ఉండటంతో హైబ్రిడ్‌ సిస్టమ్‌కు అదనపు కార్యాచరణ లభిస్తుంది. ‘కొత్తగా రే జడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ, స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ వెర్షన్‌ల విడుదలతో భారత్‌లో ఈ విభాగంలో మరిన్ని స్కూటర్లు తీసుకురావాలనుకుంటున్నామ’ని కంపెనీ ఛైర్మన్‌ మోటోఫుమి షితారా వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని