పునీత్‌ గోయెంకాను తొలగించమని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాటాదార్ల విజ్ఞప్తి
close

Published : 15/09/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పునీత్‌ గోయెంకాను తొలగించమని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వాటాదార్ల విజ్ఞప్తి

దిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌(జీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పునీత్‌ గోయెంకాను బోర్డు నుంచి తొలగించాలంటూ కీలక వాటాదారు సంస్థలు కోరుతున్నాయి. ఇన్వెస్కో డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌, ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా ఫండ్‌లకు కలిపి జీలో 17.88% వాటా ఉంది. ఇపుడు ఈ రెండు కంపెనీలు ‘పునీత్‌ను తొలగించేందుకు అసాధారణ వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయాల’ని కోరుతూ లేఖ రాశాయి. ఈ లేఖలోని వివరాలను స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లయిన మనీశ్‌ చొఖాని, అశోక్‌ కురియన్‌లను సైతం తొలగించాలని కోరుతున్నాయి. ఆ ఇద్దరు రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని