2 రోజుల్లో రూ.1,100 కోట్ల ఇ-స్కూటర్‌ అమ్మకాలు: ఓలా
close

Published : 18/09/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2 రోజుల్లో రూ.1,100 కోట్ల ఇ-స్కూటర్‌ అమ్మకాలు: ఓలా

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల జోరు రెండో రోజూ కొనసాగింది. బుధవారం అమ్మకాలు ప్రారంభించిన తొలి 24 గంటల్లో రూ.600 కోట్లకు పైగా విక్రయాలు జరిపిన సంస్థ.. గురువారం అర్ధరాత్రి అమ్మకాల ప్రక్రియను ఆపేసేవరకు జరిపిన అమ్మకాల మొత్తం విలువ రూ.1,100 కోట్లకు చేరింది. మళ్లీ నవంబరు 1న అంటే దీపావళికి ముందు తిరిగి విక్రయాలను ప్రారంభిస్తామని ఓలా సహ వ్యవస్థాపకుడు భావిశ్‌ అగర్వాల్‌ తెలిపారు. వాహన పరిశ్రమ చరిత్రలోనే కాదు.. విలువ పరంగా భారత ఇ-కామర్స్‌ చరిత్రలోనే ఒక ఉత్పత్తికి ఒక రోజులో లభించిన అత్యధిక అమ్మకాల్లో ఇదీ ఒకటని అగర్వాల్‌ తెలిపారు. అక్టోబరు నుంచి స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. కొనుగోలు చేసిన రోజు నుంచి 72 గంటల్లోగా ఎప్పుడు డెలివరీ చేస్తామనే తేదీలను కొనుగోలుదార్లకు తెలియజేస్తామని కంపెనీ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని