ఎగుమతులపై 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు
close

Published : 18/09/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎగుమతులపై 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: ‘అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా ఎగుమతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ప్రదర్శన, సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. బయోలాజికల్స్‌/ వ్యాక్సిన్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, బల్క్‌ డ్రగ్స్‌, ఐటీ, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ.. తదితర విభాగాలకు సంబంధించిన ప్రదర్శన, చర్చాగోష్ఠి ఉంటాయని పేర్కొన్నారు. ఏఈజీఎఫ్‌టీ, ఎఫ్‌ఐఈఓ, ఈఈపీసీ, అపెడా, స్పైసెస్‌ బోర్డు, ఎంపెడా, ఎఫ్‌టీసీసీఐ, ఈసీజీసీ, ఎగ్జిమ్‌ బ్యాంకు ఇందులో పాలుపంచుకుంటాయని వెల్లడించారు. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి అవకాశాలు, ఎగుమతి సంస్థలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు, రుణ సదుపాయాలు తెలుసుకునేందుకు ఈ సదస్సు వీలు కల్పిస్తుందని తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు ముందుగా తమపేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని