పీఎన్‌బీ గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గాయ్‌
close

Published : 18/09/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఎన్‌బీ గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గాయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో ఆధారిత రుణ వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 25 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించి, 6.55 శాతానికి అందిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది 6.80శాతంగా ఉంది. రూ.50లక్షలకు పైబడిన గృహరుణాలపై 0.50 శాతం వడ్డీని తగ్గించి, 6.60శాతానికే అందిస్తున్నట్లు తెలిపింది. కొత్తగా తీసుకునే రుణాలతో పాటు, ఇతర బ్యాంకుల నుంచి రుణ బదిలీకి ఇదే వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. పండగలను దృష్టిలో పెట్టుకుని, రుణాలపై విధించే రుసుములన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. కారు రుణం 7.15 శాతం, వ్యక్తిగత రుణం 8.95 శాతం వడ్డీకి ఇస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకింగ్‌ రంగంలో ఇదే తక్కువ వడ్డీ రేటుగా పేర్కొంది. గృహరుణాలను మంజూరు చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ హోం ఫైనాన్స్‌ పీఎన్‌బీతో కలిసి ఉమ్మడిగా గృహరుణాలను అందించనుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని