గరిష్టాల నుంచి సూచీలు వెనక్కి
close

Published : 18/09/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గరిష్టాల నుంచి సూచీలు వెనక్కి

సమీక్ష

866 పాయింట్ల మేర ఊగిసలాట

సూచీలు ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠాలకు చేరినా ఆ లాభాలను నిలుపుకోలేకపోయాయి. అధిక స్థాయుల వద్ద రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, లోహ, ఐటీ షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో రోజు మొత్తంమీద సెన్సెక్స్‌ 866 పాయింట్ల మేర ఊగిసలాడింది. జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీకి రూ.30,600 కోట్ల హామీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 4 పైసలు లాభపడి 73.48 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 59,409.98 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో 59,737.32 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 58,871.73 పాయింట్ల కనిష్ఠానికి పడింది. చివరకు 125.27 పాయింట్ల నష్టంతో 59,015.89 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 44.35 పాయింట్లు నష్టపోయి 17,585.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ కూడా జీవనకాల గరిష్ఠమైన 17,792.95 పాయింట్లను తాకింది.  

సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టపోయాయి. టాటా స్టీల్‌ 3.57%, ఎస్‌బీఐ 2.07%, టీసీఎస్‌ 1.85%, హెచ్‌యూఎల్‌ 1.66%, ఆర్‌ఐఎల్‌ 1.55%, సన్‌ఫార్మా 1.36%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.01% చొప్పున డీలా పడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌ 5.26%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.51%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.39%, మారుతీ సుజుకీ 1.13% మేర లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 1,168 షేర్లు సానుకూలంగా, 2,138 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. 136 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

* ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో పూనావాలా ఫిన్‌కార్ప్‌ ఎండీ అభయ్‌ భుటాడాపై సెబీ నిషేధం విధించడంతో, ఆయన తన పదవి నుంచి తప్పుకున్న సంగతి విదితమే. గురువారం తరహాలోనే. షేరు శుక్రవారం కూడా ట్రేడింగ్‌ ప్రారంభంలో 5 శాతం క్షీణించి లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. చివరకు నష్టాలను పూడ్చుకుని 3 శాతం మేర లాభపడింది. బీఎస్‌ఈలో షేరు 2.79% లాభంతో రూ.176.95 వద్ద ముగిసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని