డబ్ల్యూహెచ్‌ఓ స్పందన కోసం చూస్తున్నాం
close

Published : 18/09/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డబ్ల్యూహెచ్‌ఓ స్పందన కోసం చూస్తున్నాం

భారత్‌ బయోటెక్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ‘కొవాగ్జిన్‌’ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి సత్వరం అత్యవసర గుర్తింపు (ఈయూఎల్‌) సంపాదించేందుకు తమ వైపు నుంచి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని భారత్‌ బయోటెక్‌ ఒక ‘ట్వీట్‌’ లో పేర్కొంది. ఈ టీకాపై నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని ఈ ఏడాది జులైలో డబ్ల్యూహెచ్‌ఓకు అందజేసినట్లు వివరించింది. ‘డబ్ల్యూహెచ్‌ఓ’ లేవనెత్తిన సందేహాలకు తగిన వివరణలు ఇచ్చాం, ఈ విషయంలో తదుపరి స్పందన కోసం ఎదురుచూస్తున్నాం’ అని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ వెబ్‌సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం ‘కొవాగ్జిన్‌’ టీకాపై జులై 6న విశ్లేషణ మొదలైంది. ఈ పరిశీలన ఇంకా కొనసాగుతోంది. దీనిపై తుది నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని