టెక్నాలజీలో మహిళా నాయకత్వం పెరగాలి
close

Published : 18/09/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెక్నాలజీలో మహిళా నాయకత్వం పెరగాలి

ఈనాడు, హైదరాబాద్‌: టెక్నాలజీ రంగంలో మహిళా నాయకత్వం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఎలికో లిమిటెడ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ వనితా దాట్ల అన్నారు. మహిళలకు సంస్థలు తగిన అవకాశాలను కల్పించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ఆధ్వర్యంలో ‘టెక్నాలజీలో మహిళలు’ అనే అంశంపై మేధో మధన సదస్సు జరిగింది. ఐటీ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న 50 మందికి పైగా మహిళా లీడర్లు ఇందులో పాల్గొన్నారు. వనితా దాట్ల మాట్లాడుతూ.. మహిళలు మాట్లాడటం, బృందాలను నిర్మించడం, ఏదైనా విషయాన్ని వదిలేయకుండా ఉండటం, ఇతరులనూ వృద్ధిలోకి తీసుకురావడం లాంటివి పాటించాలని సూచించారు. మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు, ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో క్రియాశీలకంగా మారాలని తెలిపారు. హైసియా అధ్యక్షుడు భరణి అరోల్‌ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలో మహిళా నిపుణుల సంఖ్య పెంచేందుకు హైసియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే 1,000కి పైగా మిడ్‌, సీనియర్‌ లెవల్‌ మహిళా లీడర్లకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. హైసియా ఉమెన్స్‌ లీడర్స్‌ ఫోరం లీడ్‌ మమతా మాదిరెడ్డి, హైసియా సీఓఓ ఆర్‌.శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని