విమాన టికెట్ల ధరలపై పరిమితులు 15 రోజులే
close

Published : 19/09/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమాన టికెట్ల ధరలపై పరిమితులు 15 రోజులే

దిల్లీ: దేశీయంగా విమాన టికెట్ల ధరలపై పరిమితులు అమలవుతున్న సంగతి విదితమే. ఇకపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఎప్పుడైనా 15 రోజుల వ్యవధి వరకే అమలవుతాయని, 16వ రోజు తరవాత ప్రయాణానికి ఎటువంటి పరిమితులు లేకుండా విమానయాన సంస్థలు టికెట్లు విక్రయించుకోవచ్చని పౌరవిమానయాన శాఖ శనివారం ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి ఇప్పటివరకు ఈ పరిమితి 30 రోజులుగా ఉంటూ వచ్చింది. 31వ రోజు నుంచి పరిమితులు ఏమీ లేకుండా సంస్థలు టికెట్లు విక్రయించుకోవచ్చు. ‘కనిష్ఠ, గరిష్ఠ పరిమితుల మేరకు, సెప్టెంబరు 20న టికెట్‌ కొనుగోలు చేసుకుంటే అక్టోబరు 4 వరకే అమలవుతాయి. అక్టోబరు 5- ఆ తరవాత ప్రయాణానికి సెప్టెంబరు 20న టికెట్‌ కొనుగోలు చేసుకున్నా, ఈ పరిమితులు వర్తించవు’ అని పౌరవిమానయాన శాఖ తెలిపింది. సెప్టెంబరు 21న టికెట్‌ కొనుగోలు చేసుకుంటే, అక్టోబరు 5 వరకు ఈ పరిమితులు వర్తిస్తాయి. అక్టోబరు 6-ఆ తరవాత ప్రయాణానికి పరిమితులు వర్తించవు. ఈ విధంగా ధరల శ్రేణి 15 రోజులకు వర్తిస్తుంది’ అని పేర్కొంది.

85 శాతం సామర్థ్యంతో విమానాలు: విమానయాన సంస్థలు కొవిడ్‌ ముందుతో పోలిస్తే, గరిష్ఠంగా 85 శాతం సామర్థ్యంతో దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ శనివారం అనుమతులిచ్చింది. ఆగస్టు 12 నుంచి ఇప్పటివరకు 72.5 శాతం సామర్థ్యంతో విమానయాన సంస్థలు సర్వీసులు నిర్వహిస్తున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని