సంక్షిప్త వార్తలు
close

Published : 21/09/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

అక్టోబరు 12 నుంచి బడ్జెట్‌ కసరత్తు

దిల్లీ: 2022-23 వార్షిక బడ్జెట్‌ రూపకల్పనకు ఆర్థిక శాఖ అక్టోబరు 12 నుంచి కసరత్తు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 మహమ్మారితో ప్రభావితమైన దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో, వచ్చే బడ్జెట్‌లో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారో అన్నది చూడాలి. వచ్చే ఏడాది పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ‘గిరాకీని పెంచడం, ఉద్యోగాల్ని సృష్టించడం, ఆర్థిక వ్యవస్థను తిరిగి 8 శాతానికి పైగా వృద్ధితో ముందుకు తీసుకెళ్లడంపై’ దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం.  


సీసీఐ పచ్చజెండా
గంగవరం పోర్ట్‌లో ఏపీ ప్రభుత్వ వాటా కొనుగోలుకు అనుమతి పొందిన అదానీ పోర్ట్స్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ సొంతం చేసుకోడానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని అదానీ పోర్ట్స్‌ వెల్లడించింది. గంగవరం పోర్టులో ఆ సంస్థ ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు, దాన్లో పెట్టుబడి పెట్టిన విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న 89.6% వాటాను ఇప్పటికే అదానీ పోర్ట్స్‌ కొనుగోలు చేసింది. మిగిలిన 10.4% వాటాను  అదానీకి విక్రయించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. తాజాగా సీసీఐ అనుమతి కూడా రావడంతో ఇక అదానీకి అడ్డంకులు అన్నీ తొలగినట్లు అవుతోంది.


ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ నుంచి మాడ్యులర్‌ కంటెయినర్లు

ఈనాడు, హైదరాబాద్‌: సిమెంటు, భవన నిర్మాణ ఉత్పత్తుల కంపెనీ అయిన ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మొరావియా కంటెయినర్స్‌ అనే సంస్థతో కలిసి ఒక సంయుక్త కంపెనీని ఏర్పాటు చేసింది. మాడ్యులర్‌ కంటెయినర్లు, సిస్టమ్స్‌, ఇతర ఉత్పత్తులను ఈ సంయుక్త కంపెనీ అందిస్తుంది. ఈ కొత్త కంపెనీలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, దాని అనుబంధ కంపెనీలకు 74.9 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా మొరావియా కంటెయినర్స్‌కు లభిస్తుంది. తొలి దశలో ఈ సంయుక్త కంపెనీలో రూ.10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని