ఖమ్మంలో సౌత్‌ ఇండియా 25వ షోరూమ్‌
close

Published : 21/09/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖమ్మంలో సౌత్‌ ఇండియా 25వ షోరూమ్‌

హైదరాబాద్‌: సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ 25వ షోరూమ్‌ను సోమవారం ఖమ్మంలో ప్రారంభించింది. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ షోరూమ్‌ను ప్రారంభించగా.. వి.వి.సి గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.వి.రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటి కృతి శెట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని వయసుల వారి అభిరుచుల్ని ప్రతిబింబించడంలో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ముందుంటుందని కృతి శెట్టి అన్నారు. దక్షిణాదిలోని ప్రముఖ నగరాలకు సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ విస్తరించనుందని సంస్థ డైరెక్టర్లు సురేశ్‌ శీర్ణ, రాకేశ్‌, కేశవ్‌ వెల్లడించారు. పురుషులు, మహిళలు, పిల్లల కోసం 4 లక్షలకు పైగా మోడళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని