ఒకసారి ఛార్జింగ్‌తో 250 కిలోమీటర్ల ప్రయాణం
close

Published : 21/09/2021 04:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకసారి ఛార్జింగ్‌తో 250 కిలోమీటర్ల ప్రయాణం

ఒమేగా సైకీ విద్యుత్‌ వాణిజ్య వాహనం

ముంబయి: విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సైకీ మొబిలిటీ (ఓఎస్‌ఎమ్‌) తమ తొలి విద్యుత్‌ చిన్న వాణిజ్య వాహనం (ఎస్‌సీవీ) ఎం1కేఏను సోమవారం ఆవిష్కరించింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఈ వాహనానికి బుకింగ్‌లు ప్రారంభిస్తామని పేర్కొంది. 2 టన్నుల పేలోడ్‌ సామర్థ్యంతో తక్కువ బరువు, ఎన్‌ఎంసీ ఆధారిత 90 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో ఎస్‌సీవీని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని వెల్లడించింది. డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌లో ఈ బ్యాటరీని 4 గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ చేయవచ్చని పేర్కొంది. 10 అడుగుల లోడింగ్‌ ఏరియా ఈ వాహనం సొంతమని, కొరియర్‌, వస్తువుల పంపిణీ, ఇ-కామర్స్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఒమేగా సైకీ మొబిలిటీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ఉదయ్‌ నారంగ్‌ వెల్లడించారు.


వోల్వో నుంచి 6 హెవీ డ్యూటీ ట్రక్కులు

దిల్లీ: గనుల తవ్వకం, రహదారి నిర్మాణం, ఇ-కామర్స్‌, సరకు రవాణా వంటి వివిధ విభాగాల్లో సేవలు అందించేందుకు వీలుగా వోల్వో ట్రక్స్‌ ఇండియా సోమవారం 6 హెవీ డ్యూటీ ట్రకుల్ని విడుదల చేసింది. ఈ కంపెనీ ఇప్పటికే గనుల తవ్వకం విభాగంలో బలమైన విపణిని కలిగి ఉంది. నిర్మాణ, రవాణా, ఇ-కామర్స్‌ విభాగాల్లో తమ ఉనికి చాటేందుకు ఈ వాహనాలను తీసుకొచ్చినట్లు వీఈసీవీ ఎండీ, సీఈఓ వినోద్‌ అగర్వాల్‌ వెల్లడించారు. వోల్వో నూతన ట్రక్కుల ధర రూ.1 కోటి పైనే ఉంటుంది. అందుకే విక్రయాలు అధిక పరిమాణంలో జరగవని అగర్వాల్‌ వివరించారు. ప్రీమియం ట్రక్‌ విభాగంలో దేశంలో 85 శాతం వాటా తమదేనని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని