న్యూయార్క్‌లో 210 కోట్ల డాలర్లతో ప్రాంగణం కొనుగోలు: గూగుల్‌
close

Published : 22/09/2021 03:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యూయార్క్‌లో 210 కోట్ల డాలర్లతో ప్రాంగణం కొనుగోలు: గూగుల్‌

వాషింగ్టన్‌: మన్‌హట్టన్‌ ప్రాంగణం కొనుగోలుకు 201 కోట్ల డాలర్లు వెచ్చించనున్నట్లు గూగుల్‌ తెలిపింది. న్యూయార్క్‌ నగరంలో సెయింట్‌ జాన్స్‌ టెర్మినల్‌ను కొనుగోలు చేసి, తమ హడ్సన్‌ స్క్వేర్‌ ప్రాంగణానికి ప్రధాన కేంద్రంగా దాన్ని యాంకర్‌గా చేయాలని గూగుల్‌ భావిస్తోంది. కొవిడ్‌ పరిణామాల కారణంగా నగరంలోని చాలా కార్యాలయాలకు ఇప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగులు రావడం లేదు. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తమ ఉద్యోగుల్ని జనవరి 10 వరకు కార్యాలయాలకు రప్పించబోమని తెలిపారు. న్యూయార్క్‌లో సుమారు 2 దశాబ్దాలకు పైగా గూగుల్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాలిఫోర్నియాకు బయట కంపెనీకి అతి పెద్ద కార్యాలయం ఇక్కడే ఉంది. హడ్సన్‌ నదిపై హడ్సన్‌ స్క్వేర్‌ క్యాంపస్‌ 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. న్యూయార్క్‌ క్యాంపస్‌లో ఈ ఏడాది 25 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. సెయింట్‌ జాన్స్‌ టెర్మినల్‌ ప్రోపర్టీని ప్రస్తుతం లీజుకు ఇచ్చి, 2023 మధ్యలో కొత్త కార్యాలయం అక్కడే తెరుస్తామని పేర్కొంది. ఈ క్యాంపస్‌లో పెట్టే పెట్టుబడులతో న్యూయార్క్‌లో మరో 14,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని