పునరుత్పాదక విద్యుదుత్పత్తిపై రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి: అదానీ
close

Published : 22/09/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పునరుత్పాదక విద్యుదుత్పత్తిపై రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి: అదానీ

దిల్లీ: రాబోయే పదేళ్లలో పునరుత్పాదక విద్యుదుత్పత్తి, విడిభాగాల తయారీ, పంపిణీ, సరఫరాలపై 20 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.1,50,000 కోట్లు) అదానీ గ్రూపు పెట్టుబడిగా పెట్టనుంది. ప్రపంచంలోనే అత్యంత చౌక స్వచ్ఛ ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. జేపీ మోర్గాన్‌ ఇండియా ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ మాట్లాడుతూ పై విషయాలను వెల్లడించారు. ‘వచ్చే నాలుగేళ్లలో పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచే యోచనలో ఉన్నాం. హైడ్రోజన్‌ ఉత్పత్తిపై దృష్టి పెడతాం. డేటా కేంద్రాలన్నింటికీ పునరుత్పాదక విద్యుత్‌ అందిస్తాం. 2025 కల్లా కర్బన రహితంగా పోర్ట్‌లను మారుస్తాం. 2025 వరకు మూలధన వ్యయంలో 75 శాతాన్ని గ్రీన్‌ టెక్నాలజీస్‌ పైనే వెచ్చిస్తామ’ని గౌతమ్‌ తెలిపారు. ప్రస్తుతం అదానీ గ్రూపు స్థాయిలో ప్రపంచంలోని ఏ కంపెనీ కూడా పునరుత్పాదక విద్యుత్‌ పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేయడం లేదని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం సౌర విద్యుదుత్పత్తి పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. మేం రెండేళ్లలోనే ఈ ఘనతను సాధించాం. నిర్దేశిత నాలుగేళ్ల కంటే ముందుగానే పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి 25 గిగావాట్ల ప్రాథమిక లక్ష్యాన్ని అందుకున్నాం. 2030 కల్లా ప్రపంచంలో దిగ్గజ పునరుత్పాదక విద్యుత్‌ కంపెనీగా మారేందుకు మాకు ఇవి దోహదం చేస్తాయ’ని గౌతమ్‌ అదానీ వివరించారు. వీటితో పాటు మౌలిక రంగాలు, దేశానికి కీలకమైన విభాగాలపై దృష్టి సారించడాన్ని అదానీ గ్రూపు కొనసాగిస్తుందని ఆయన అన్నారు. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో 12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో 50కి పైగా ఆస్తులను కొనుగోలు చేశామని అదానీ గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని