బలంగా పుంజుకున్న సూచీలు
close

Published : 22/09/2021 03:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బలంగా పుంజుకున్న సూచీలు

మెరిసిన ఐటీ, ఫైనాన్స్‌ షేర్లు

రంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న సూచీలు లాభాలు నమోదుచేశాయి. చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్‌ రుణ సంక్షోభంపై భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నాయి. దీంతో మన మార్కెట్లకు సైతం దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఫైనాన్స్‌, లోహ షేర్లు మెరవగా, రూపాయి విలువ పెరగడం సెంటిమెంట్‌ను బలపరిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు తగ్గి 73.61 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 58,630.06 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారుకుని, ఇంట్రాడేలో 58,232.54 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీ లాభాల్లోకి వచ్చి.. 59,084.51 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 514.34 పాయింట్ల లాభంతో 59,005.27 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం  165.10 పాయింట్లు పెరిగి 17,562 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,326.10- 17,578.35 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.94%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4.29%, ఐటీసీ 3.36%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.18%, టాటా స్టీల్‌ 3.08%, టెక్‌ మహీంద్రా 2.05%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.85%, ఇన్ఫోసిస్‌ 1.77%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.64% రాణించాయి. లోహ షేర్లు కోలుకున్నాయి. పరాస్‌ డిఫెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజు 16.57 రెట్ల స్పందన లభించింది.


107 రోజుల్లో కోటి కొత్త ఖాతాలు: బీఎస్‌ఈ

కేవలం 107 రోజుల్లో (జూన్‌ 6 నుంచి సెప్టెంబరు 21 మధ్య) ఒక కోటి కొత్త డీమ్యాట్‌ ఖాతాలు వచ్చాయని, దీంతో నమోదిత మదుపర్ల ఖాతాల సంఖ్య 8 కోట్లకు చేరిందని బీఎస్‌ఈ తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 6 నాటికి బీఎస్‌ఈ వినియోగదార్ల సంఖ్య 7 కోట్లకు చేరింది. మే 23, 2020 నుంచి సుమారు 12 నెలల కాలంలో 2 కోట్ల మంది నమోదుకావడం ఇందుకు దోహదం చేసింది. 2008లో కేవలం ఒక కోటి మదుపర్ల ఖాతాలే ఉండేవని బీఎస్‌ఈ ఎండీ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని