2035కు హైడ్రోజన్‌తో నడిచే విమానాలు
close

Published : 23/09/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2035కు హైడ్రోజన్‌తో నడిచే విమానాలు

ఫ్రాన్స్‌: హైడ్రోజన్‌తో నడిచే, కాలుష్యాన్ని వెదజల్లని వాణిజ్య విమానాలను 2035 నాటికి తీసుకురావాలన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ఎయిర్‌బస్‌ ధీమాగా చెబుతోంది. సరైన మోతాదులో సరైన ఇంధనం లభించడమే సవాలు కావొచ్చని, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎయిర్‌బస్‌ సీఈఓ గ్విల్లామ్‌ ఫారీ పేర్కొన్నారు. కొత్త ఇంధనాలను విమానాశ్రయాలు, విమానాల్లో వినియోగించేందుకు, విమానాలను ధ్రువీకరించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని వివరించారు. భద్రత, విశ్వసనీయత, విమానాలను నిర్వహించడంలో సవాళ్లూ ఉంటాయని పేర్కొన్నారు. హైడ్రోజన్‌తో నడిచే 3 రకాల విమాన కాన్సెప్ట్‌లను సంస్థ విడుదల చేసింది. 100, 200 మందిని తీసుకెళ్లే, 1000 నాటికల్‌ మైళ్లు ప్రయాణించే సామర్థ్యంతో హైడ్రోజన్‌ ఇంధన విమానాలను రూపొందించే యత్నాల్లో ఎయిర్‌బస్‌ ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని