రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

చండీగఢ్‌: భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. జీఎస్‌టీ వసూళ్లు, ప్రత్యక్ష పన్నుల తీరే ఇందుకు సాక్ష్యమని అన్నారు. రిటైల్‌, చిన్న మదుపర్లు షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా కనిపిస్తుండడంతో భారత స్టాక్‌ మార్కెట్‌ మరింతగా రాణించగలదని శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. వివిధ అంశాలపై ఆమె ఏమన్నారంటే..

రికవరీపై: స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఆదాయ వసూళ్లు ఇంతలా ఉండవు. ప్రత్యక్ష పన్నుల విషయంలో అర్ధ సంవత్సర లక్ష్యాన్ని ఇప్పటికే సాధించాం. జీఎస్‌టీ వసూళ్లు సగటున నెలకు రూ.1.11 లక్షల కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్ల వరకు ఉంటున్నాయి.ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా రికవరీ దారిలో స్థిరంగా నడుస్తోందని అవి సూచిస్తున్నాయి.  జీఎస్‌టీ చట్టంలో పెట్రోలు, డీజిల్‌ ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి వాటిని ఆ పరిధి కిందకు తీసుకురావడానికి ప్రత్యేకంగా అందులో సవరణ చేయాల్సిన అవసరం ఉండదు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని