భారత్‌లో అత్యుత్తమ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
close

Published : 26/09/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో అత్యుత్తమ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ఆసియామనీ 2021 పోల్‌

దిల్లీ: భారత్‌లో అత్యుత్తమ సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిలిచింది. వరుసగా నాలుగో ఏడాదీ దేశీయ బ్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రముఖ సంస్థ ఆసియామనీ 2021 పోల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఘనత సాధించింది. 1070 మంది పైగా ఫండ్‌ మేనేజర్లు, అనలిస్ట్‌లు, బ్యాంకర్లు, రేటింగ్‌ ఏజెన్సీలు ఈ పోల్‌లో పాల్గొన్నారు. ఆర్థిక పనితీరు, నిర్వహణ, పెట్టుబడిదారు సంబంధాలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యకలాపాలు వంటి విభాగాల్లో నమోదిత సంస్థల పనితీరుపై ఈ పోల్‌ను రూపొందించారు. దేశం, రంగం వారీగా నమోదిత కంపెనీలను విభజించారు. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు అత్యధిక ఓట్లు లభించాయి. ఈ గౌరవం లభించడం పట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఎఫ్‌ఓ శ్రీనివాసన్‌ వైద్యనాధన్‌ హర్షం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని