ఐపీఓకు గోదావరి బయోరిఫైనరీస్‌
close

Published : 26/09/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఓకు గోదావరి బయోరిఫైనరీస్‌

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద గోదావరి బయోరిఫైనరీస్‌ ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. ముసాయిదా పత్రాల ప్రకారం.. తాజాగా రూ.370 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 65,58,278 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, పెట్టుబడిదార్లు విక్రయించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో సమీర్‌ శాంతిలాల్‌ సోమయ్య, సోమయ్య ఏజెన్సీస్‌ చెరో 5 లక్షల ఈక్విటీ షేర్లు, మండల క్యాపిటల్‌ 49.27 లక్షల వరకు షేర్లు, ఫిల్‌మీడియా కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ 3 లక్షల వరకు షేర్లు, సోమయ్య ప్రోపర్టీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 1.31 లక్షల వరకు షేర్లు, లక్ష్మీవాడి మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ 2 లక్షల వరకు షేర్లు విక్రయిస్తారు. కంపెనీ ముందస్తు ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.100 కోట్ల వరకు సమీకరించొచ్చు. ఇది పూర్తయితే.. తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ రుణ చెల్లింపులు, చెరకు క్రషింగ్‌ విస్తరణకు మూలధన వ్యయాలు, పొటాష్‌ యూనిట్‌ విస్తరణ, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని