3 నుంచే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌
close

Published : 27/09/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 నుంచే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌

దిల్లీ: పండుగల సందర్భంగా రాయితీ విక్రయాలకు ఉద్దేశించిన గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ (జీఐఎఫ్‌)ను అక్టోబరు 3 నుంచే ప్రారంభించబోతున్నట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం అక్టోబరు 4 నుంచి జీఐఎఫ్‌ ప్రారంభించాల్సి ఉంది. ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ కూడా అక్టోబరు 7-12 తేదీలకు బదులు 3-10 తేదీల్లో జరగనుంది. గతేడాది పండుగ సీజన్‌లో ఇ-కామర్స్‌ దిగ్గజాల అమ్మకాలు 740 కోట్లుగా నమోదు కాగా, ఈ ఏడాది 900 కోట్ల డాలర్ల మేర జరగొచ్చని కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ అంచనా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని