పసిడి దిద్దుబాటు!
close

Published : 27/09/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి దిద్దుబాటు!

కమొడిటీస్‌ ఈవారం

బంగారం

పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.45,646 కంటే దిగువన ట్రేడయితే రూ.45,429; రూ.45,213 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అయితే రూ.45,152 వద్ద కాంట్రాక్టుకు మద్దతు లభించవచ్చు. ఇదే జరిగితే రూ.44,869 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.45,152 స్థాయికి సమీపంలో కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. రూ.46,726 కంటే పైన కదలాడనంత వరకు పసిడి కాంట్రాక్టుకు ప్రతికూల ధోరణి కొనసాగుతుందనే భావించవచ్చు. ఈవారంలో వెలువడే అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు, డాలరు కదలికలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి.
* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ అక్టోబరు ఫ్యూచర్‌ కాంట్రాక్టు రూ.13,882 కంటే పైన కదలాడకుంటే రూ.13,570; రూ.13,482 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు.


 వెండి

వెండి డిసెంబరు కాంట్రాక్టు రూ.60,883 కంటే పైన కదలాడితే రూ.61,182; రూ.61,591 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ట్రేడర్లు రూ.59,888 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ స్థాయి కంటే కిందకు వస్తే కాంట్రాక్టు మరింత డీలాపడే అవకాశం ఉంది. అదే సమయంలో రూ.60,773 ఎగువన షార్ట్‌ సెల్లింగ్‌కు దూరంగా ఉండటమే మంచిది.


ప్రాథమిక లోహాలు

ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.16,408 కంటే పైన చలించకుంటే.. మరింతగా దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ ఈ స్థాయి కంటే పైకి వెళితే రాణించే అవకాశం ఉంటుంది.

రాగి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.734.75 కంటే ఎగువన చలించకుంటే.. షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

​​​​​​​సీసం అక్టోబరు ఫ్యూచర్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.182.85 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.180 దిగువన షార్ట్‌ సెల్‌ చేయొచ్చు.

​​​​​​​ జింక్‌ అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.263 కంటే దిగువన ట్రేడయితే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. రూ.252 దిగువన కాంట్రాక్టు బలహీనంగా కన్పిస్తోంది.

​​​​​​​  అల్యూమినియం అక్టోబరు కాంట్రాక్టుకు అధిక స్థాయుల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రూ.237 సమీపంలో లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు లాభాలు స్వీకరించడం మంచిది.

​​​​​​​ నికెల్‌ అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,492 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది.


 ఇంధన రంగం

​​​​​​​ ముడి చమురు అక్టోబరు కాంట్రాక్టును ఈవారం రూ.5,163 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.5,238 ఎగువన కొనుగోలు చేయొచ్చు.

​​​​​​​సహజవాయువు అక్టోబరు కాంట్రాక్టుకు ఈవారం రూ.383 ఎగువన షార్ట్‌ సెల్లింగ్‌కు దూరంగా ఉండటం మేలు. ఈ స్థాయి కంటే పైన నిలదొక్కుకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిది.

​​​​​​​ ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,157 కంటే పైన కదలాడకుంటే.. మరింత కిందకు వచ్చే అవకాశం ఉంటుంది.


 వ్యవసాయ ఉత్పత్తులు

​​​​​​​ పసుపు అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.6,858 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే లాంగ్‌ పొజిషన్లను కొనసాగించడం మంచిదే.

​​​​​​​ జీలకర్ర అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.14,722 కంటే పైన కదలాడకుంటే దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని