12 గంటల పాటు పనిచేసే దగ్గు మందు
close

Published : 29/09/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12 గంటల పాటు పనిచేసే దగ్గు మందు

విడుదల చేసిన సన్‌ ఫార్మా

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఛెరికాఫ్‌-12’ అనే దగ్గు మందును సన్‌ ఫార్మా దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఇది డెట్రామెథార్ఫన్‌ హైడ్రోబ్రోమైడ్‌ 30 ఎంజీ, క్లోర్‌ఫెనిరామైన్‌ మలేట్‌ 4 ఎంజీ ఔషధాల మిశ్రమం. ‘సస్టెయిన్డ్‌ రీలీజ్‌’ లక్షణం కోసం పాలిస్టైరెక్స్‌ టెక్నాలజీతో ఈ మందు ఉత్పత్తి చేసినట్లు సన్‌ ఫార్మా ఒక ప్రకటనలో వివరించింది. సాధారణ దగ్గు మందు (కఫ్‌ సిరప్‌) 6 నుంచి 7 గంటల పాటు ఉపశమనం కలిగిస్తుందని, కానీ ‘ఛెరికాఫ్‌-12’తో 12 గంటల పాటు ఉపశమనం లభిస్తుందని సంస్థ వెల్లడించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని