15న ఎయిరిండియా కొత్త యజమాని పేరు వెల్లడి!
close

Published : 29/09/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15న ఎయిరిండియా కొత్త యజమాని పేరు వెల్లడి!

దిల్లీ: ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అక్టోబరు 15 (దసరా) నాటికి విజయవంతమైన బిడ్డర్‌ పేరును ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంస్థ కోసం బిడ్లు దాఖలు కాగా, నేడు (ఈనెల 29న) ఆర్థిక బిడ్లు తెరిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిడ్‌ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. టాటా సన్స్‌ సహా స్పైస్‌జెట్‌ అధిపతి అజయ్‌ సింగ్‌ కూడా ఆర్థిక బిడ్లు సమర్పించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని