తక్కువ నిర్వహణ కార్లే ‘నడుస్తాయ్‌’
close

Published : 17/10/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తక్కువ నిర్వహణ కార్లే ‘నడుస్తాయ్‌’

పెరిగిన ఇంధన ధరలే కారణం

హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ రీసెర్చ్‌

దిల్లీ: ఇంధన ధరలు గత 15 నెలల్లో 35% మేర ప్రియం కావడంతో వాహన నిర్వహణ వ్యయాలపై ప్రభావం పడుతోంది. అధిక ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ వ్యయాలున్న కార్లపై కొనుగోలుదార్లు ఆసక్తి చూపవచ్చని హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ రీసెర్చ్‌ అంటోంది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు విభాగంపై దృష్టి ఉండొచ్చని చెబుతోంది. ‘భారత మార్కెట్లో 70% ప్యాసింజరు వాహనాల ధర రూ.10 లక్షలలోపే ఉంటోంది. ఈ విభాగంలో అత్యధిక మార్కెట్‌ వాటా ఉన్న మారుతీ సుజుకీకి తాజా పరిణామం వల్ల అధిక ప్రయోజనాలు దక్కవచ్చు. ఇంధన ధరల పెరుగుదలను వినియోగదార్లు గట్టిగానే పట్టించుకుంటున్నారు. మొత్తం మీద రూ.10 లక్షల లోపు విభాగంలో మారుతీకి 65% వాటా ఉండడం; గత 10 ఏళ్లలో ఇంధన సామర్థ్యం 15-30% ¢పెరగడంతో పోటీపరంగా మారుతీ మెరుగైన స్థానంలో ఉంద’ని తన నివేదికలో చెప్పుకొచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని