సెటిల్‌మెంట్‌ వివాదాలపై నలుగురు సభ్యులతో కమిటీ: సెబీ
close

Published : 17/10/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెటిల్‌మెంట్‌ వివాదాలపై నలుగురు సభ్యులతో కమిటీ: సెబీ

దిల్లీ: సెటిల్‌మెంట్‌ వివాదాల పరిష్కారంపై నలుగురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి సలహాదారు కమిటీని సెబీ ఏర్పాటుచేసింది. బొంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన విజయ్‌ సి డాగా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సెబీ తెలిపింది. ఈ కమిటీలోని మిగతా సభ్యుల్లో.. న్యాయ శాఖ మాజీ కార్యదర్శి పి.కె.మల్హోత్రా, డెలాయిట్‌ హస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ మాజీ ఛైర్మన్‌ పిఆర్‌ రమేశ్‌, రవల్‌ అండ్‌ రవల్‌ అసోసియేట్స్‌ పార్ట్‌నర్‌ డిఎన్‌ రవల్‌ ఉండనున్నారు. 2018లో సెబీ నిర్దేశించిన సెటిల్‌మెంట్‌ ప్రక్రియ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కమిటీ పనిచేయనుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని