రత్నాభరణాల ఎగుమతుల్లో 29% వృద్ధి
close

Published : 17/10/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రత్నాభరణాల ఎగుమతుల్లో 29% వృద్ధి

ముంబయి: సెప్టెంబరులో భారత రత్నాభరణాల ఎగుమతులు 29.67% వృద్ధితో రూ.23,259.55 కోట్లకు చేరాయని జెమ్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జీజేఈపీసీ) ప్రకటించింది. 2019 సెప్టెంబరులో వీటి విలువ రూ.23,491.20 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్య షిప్‌మెంట్లు 134.55% పెరిగి రూ.1,40,412.94 కోట్లకు చేరాయి. 2019 ఇదే సమయంలో ఇవి రూ.59,864.55 కోట్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వం ఈ రంగానికి పెట్టుకున్న 41.66 బి.ఎగుమతుల లక్ష్యంలో ఇప్పటికే దాదాపు సగం (46 శాతం) సాధించామని, కొవిడ్‌ ఆంక్షలు సడలించిన తర్వాత సెంటిమెంట్‌ సానుకూలంగా మారిందని జీజేఈపీసీ ఛైర్మన్‌ కొలిన్‌ షా పేర్కొన్నారు. పండగల సీజన్‌లో ఇదే జోరు కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

* 2021 ఏప్రిల్‌- సెప్టెంబరులో కట్‌ అండ్‌ పాలిష్డ్‌ డైమండ్‌ ఎగుమతులు 122.62 శాతం వృద్ధితో రూ.91,489.2 కోట్లకు చేరాయి. 2020లో ఇవి రూ.41,095.83 కోట్లుగా ఉన్నాయి.

* పసిడి ఆభరణాల ఎగుమతులు రూ.8,100.97 కోట్ల నుంచి 262.66 శాతం దూసుకెళ్లి రూ.29,379.36 కోట్లకు వృద్ధి చెందాయి.

* వెండి ఆభరణాల ఎగుమతులు రూ.6,392.65 కోట్ల నుంచి 48.25 శాతం పెరిగి రూ.9,477.39 కోట్లుగా నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని