D-Mart Q2 results: డి-మార్ట్‌ లాభం రెండింతలు
close

Updated : 17/10/2021 07:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

D-Mart Q2 results: డి-మార్ట్‌ లాభం రెండింతలు

దిల్లీ: డి-మార్ట్‌ రిటైల్‌ విక్రయకేంద్రాలను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జులై- సెప్టెంబరు త్రెమాసికానికి రూ.417.76 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.198.53 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు రెండింతలైంది.ఆదాయం రూ.5,306.20 కోట్ల నుంచి 46.79 శాతం పెరిగి రూ.7,788.94 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.7,248.74 కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ.5,046.69 కోట్లతో పోలిస్తే ఇవి 43.63 శాతం ఎక్కువ. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రూ.7,649.64 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే త్రైమాసికంలోని రూ.5,218.15 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 46.6% వృద్ధి ఉంది. ‘కొవిడ్‌-19 నియంత్రణకు విధించిన ఆంక్షలను సెప్టెంబరు త్రైమాసికంలో మరింతగా సడలించారు. ఈ ప్రభావంతో ఏడాది క్రితంతో పోలిస్తే ఆదాయాలు 46.6 శాతం పెరిగాయి. రెండేళ్లు లేదా అంతకు పైబడిన విక్రయ కేంద్రాల ఆదాయాల్లో 23.7 శాతం వృద్ధి నమోదైంద’ని అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నెవిల్లి నోరోన్హా అన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని