హెచ్‌డీఎఫ్‌సీ లాభంలో 18% వృద్ధి
close

Published : 17/10/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌డీఎఫ్‌సీ లాభంలో 18% వృద్ధి

జులై- సెప్టెంబరులో రూ.9,096 కోట్లు
పెరిగిన మొండి బకాయిలు

దిల్లీ: జులై- సెప్టెంబరు త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.9,096 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,703 కోట్లతో పోలిస్తే లాభం 18 శాతం పెరిగింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ లాభంలో వృద్ధి ఉండటం గమనార్హం. ఏకీకృత ఆదాయం రూ.38,438.47 కోట్ల నుంచి పెరిగి రూ.41,436.36 కోట్లకు చేరింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.8,834.30 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.7,513.10 కోట్లతో పోలిస్తే లాభంలో 17.6 శాతం వృద్ధి ఉంది. మొత్తం ఆదాయం రూ.36,069.42 కోట్ల నుంచి పెరిగి రూ.38,754.16 కోట్లకు చేరింది.

* నికర వడ్డీ ఆదాయం 12.1 శాతం వృద్ధితో రూ.15,776.40 కోట్ల నుంచి పెరిగి రూ.17,684.40 కోట్లకు చేరింది.

* 2021 సెప్టెంబరు 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 1.35 శాతానికి పెరిగాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఇవి 1.08 శాతంగా ఉన్నాయి.

* విలువ పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ.11,304.60 కోట్ల నుంచి రూ.16,346.07 కోట్లకు, నికర నిరర్థక ఆస్తులు రూ.1,756.08 కోట్ల నుంచి పెరిగి రూ.4,755.09 కోట్లకు చేరాయి.

* మొండి బకాయిలు, ఇతరత్రా వాటికి కేటాయింపులు కూడా రూ.3,703.50 కోట్ల నుంచి రూ.3,924.66 కోట్లకు పెరిగాయి. వ్యాపార కార్యకలాపాలపై కొవిడ్‌-19 ప్రభావం కొనసాగడం అనేది భవిష్యత్‌లో చోటుచేసుకునే పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది.

* 2021 సెప్టెంబరు 30 నాటికి కనీస మూలధన నిష్పత్తి 20 శాతంగా ఉంది. కిందటేడాది ఇదే సమయంలో ఇది 19.1 శాతంగా నమోదైంది.

* అనుబంధ సంస్థల విషయానికొస్తే.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సమీక్షా త్రైమాసికంలో రూ.191.70 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ రూ.85 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ నికర లాభం రూ.165.80 కోట్ల నుంచి 44 శాతం పెరిగి రూ.239.60 కోట్లకు చేరింది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌- సెప్టెంబరు) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం రూ.16,564 కోట్లు కాగా.. ఏడాదిక్రితం ఇదే సమయంలోని రూ.14,172 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం కూడా రూ.70,522.70 కోట్ల నుంచి పెరిగి రూ.75,525.60 కోట్లకు చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని