బ్యాడ్‌బ్యాంక్‌ బోర్డులోకి మరికొందరు!
close

Published : 18/10/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాడ్‌బ్యాంక్‌ బోర్డులోకి మరికొందరు!

దిల్లీ: బ్యాడ్‌బ్యాంకుగా వ్యవహరిస్తున్న జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) బోర్డులోకి మరికొందరిని తీసుకుని, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను పారదర్శకంగా నిర్వహించాలని సంస్థ భావిస్తోంది. రూ.6000 కోట్లతో ఎన్‌ఏఆర్‌సీఎల్‌ ఏర్పాటుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) లైసెన్స్‌ ఇవ్వగా, ఇందులో 51 శాతం వాటా ప్రభుత్వరంగ బ్యాంకులదే. ప్రైవేటురంగ బ్యాంకులకు ఇందులో 49 శాతం వాటా ఉంటుంది. బోర్డులోని డైరెక్టర్ల వివరాలను త్వరలో అందచేయాల్సిందిగా ఎన్‌ఏఆర్‌సీఎల్‌ను ఆర్‌బీఐ కోరింది. ఈ నేపథ్యంలోనే ఒత్తిడికి గురవుతున్న ఆస్తుల వ్యవహారాల్లో నిపుణుడు అయిన పి.ఎం.నాయర్‌ను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తీసుకుని, ఎన్‌ఏఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా తీసుకున్నారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సీఈఓ మెహ్తా, ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ఎస్‌.ఎస్‌.నాయర్‌, కెనరాబ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అజిత్‌ కృష్ణన్‌ నాయర్‌లను డైరెక్టర్లుగా నియమించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని