ఆహార ఉత్పత్తుల్లోకి ‘డబుల్‌ హార్స్‌’
close

Published : 18/10/2021 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహార ఉత్పత్తుల్లోకి ‘డబుల్‌ హార్స్‌’

మార్కెట్లోకి సున్నుండలు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ఇప్పటివరకు పప్పుల రంగంలోనే ఉన్న ‘డబుల్‌ హార్స్‌’ ఆహార ఉత్పత్తుల రంగంలోకీ ప్రవేశించింది. ఇందుకోసం ‘తెనాలి డబుల్‌ హార్స్‌ ఫుడ్స్‌’ పేరిట అనుబంధ సంస్థను నెలకొల్పింది. తొలుత సున్నుండలను తయారు చేసి 400, 200 గ్రాముల ప్యాకెట్లలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులోని తమ సంస్థ నూతన భవంతి ప్రారంభోత్సవంలో సున్నుండల ప్రచార చిత్రాన్ని ప్రతినిధులు ఆవిష్కరించారు. ఫుడ్స్‌ విభాగం మొత్తాన్ని మహిళలే నిర్వహిస్తారని సంస్థ అధినేత మునగాల మోహన్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. త్వరలో దోసె పిండి మార్కెట్లోకి రానుందని, నీరు కలిపి వెంటనే దోసెలు పోసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని