Grofers: 10 నిమిషాల్లో నిత్యావసరాలు అందిస్తాం - Grofers plans to deliver anything in 10 minutes
close

Updated : 19/10/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Grofers: 10 నిమిషాల్లో నిత్యావసరాలు అందిస్తాం

స్థానిక వ్యాపారుల భాగస్వామ్యంతోనే
గ్రోఫోర్స్‌ సీఈఓ అల్బీందర్‌ థిండ్సా

దిల్లీ: ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని, నిత్యావసర వస్తువులను సరఫరా చేసే గ్రోఫోర్స్‌.. తక్షణ ఇ-కామర్స్‌ సంస్థగా సేవలు విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇందుకోసం 13 నగరాల్లో విక్రయదార్లతో ఒప్పందాలు చేసుకుంది. మున్ముందు ఐఫోన్‌ సహా అన్ని రకాల మొబైల్‌ ఫోన్లను కూడా ఈ సంస్థ ఇదే పద్ధతిలో సరఫరా చేయాలని భావిస్తోంది. ఇందుకోసం స్థానిక వ్యాపార సంస్థలతో జట్టు కట్టేందుకు కసరత్తు చేస్తోంంది. ఆర్డరు చేసిన 10 నిమిషాల్లోనే సరకులను సరఫరా చేసే సేవలను ఈ ఏడాది ఆగస్టులో దిల్లీ, ముంబయి, బెంగళూరు, జయపుర లాంటి 10 నగరాల్లో గ్రోఫోర్స్‌ ప్రారంభించింది. ఈ సేవలను మొబైల్‌ ఫోన్లకు కూడా విస్తరించాలని కంపెనీ అనుకుంటోందని తెలుస్తోంది. ‘ఇన్‌స్టంట్‌ కామర్స్‌ (తక్షణమే సరఫరా సేవల) విభాగంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్న వ్యాపారవేత్తల కోసం అన్వేషణను కొనసాగిస్తున్నాం. ఇప్పటికే 13 నగరాల్లో 86 డార్క్‌ స్టోర్స్‌ యజమానులతో జట్టు కట్టామ’ని గ్రోఫోర్స్‌ గ్రోఫోర్స్‌ సీఈఓ అల్బీందర్‌ థిండ్సా ట్వీట్‌ చేశారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని