అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం రూ.1,310 కోట్లు
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం రూ.1,310 కోట్లు

దిల్లీ: అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,310.34 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,310.06 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.10,387.14 కోట్ల నుంచి 15.69 శాతం పెరిగి రూ.12,016.78 కోట్లకు చేరింది. ఆదాయం పెరిగినా బొగ్గు, పెట్‌ కోక్‌ ధరలు పెరగడంతో నికర లాభం తగ్గిందని కంపెనీ తెలిపింది. మొత్తం వ్యయాలు రూ.8,724.43 కోట్ల నుంచి 17.02 శాతం పెరిగి రూ.10,209.43 కోట్లకు చేరాయి. బొగ్గు, పెట్‌ కోక్‌ ధరలు రెండింతలు కావడంతో వ్యయాలు 17 శాతం మేర పెరిగాయని, విద్యుత్‌ వినియోగం తగ్గించుకునేందుకు కార్యకలాపాలను పాక్షికంగా నిలిపామని కంపెనీ వివరించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని