అంకురాలకు అంతర్జాతీయ అవకాశాలు
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంకురాలకు అంతర్జాతీయ అవకాశాలు

టి-హబ్‌ సీఈఓ ఎం.శ్రీనివాస రావు

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా దేశీయ అంకురాలకు తోడ్పాటునందించడంతో పాటు, అవి వేగంగా వృద్ధి చెందేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని టి-హబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) మహంకాళి శ్రీనివాస రావు పేర్కొన్నారు. దాదాపు 5.82లక్షల చదరపు అడుగుల్లో ప్రారంభం కానున్న టి-హబ్‌ కొత్త భవనం దీనికి మరింత ఊతమిస్తుందని తెలిపారు. కార్పొరేట్లు, ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు, దేశంలోని పలు రంగాలకు అవసరమైన సేవలనూ ఇక్కడి నుంచి అందించేలా ఈ భవనం సిద్ధమౌతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పలు ఆసక్తికర ప్రాజెక్టులు, భాగస్వామ్యాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. అంకురాలకు పెట్టుబడులను సమకూర్చే లక్ష్యంతో తీసుకొచ్చిన టి-ఫండ్‌ను మరింత విస్తృతం చేయనున్నామని పేర్కొన్నారు. ఐటీ, క్లీన్‌టెక్‌, అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, హెల్త్‌-టెక్‌, ఏఐ, మెషిన్‌లెర్నింగ్‌, ఐఓటీ, ఏఆర్‌/వీఆర్‌, బ్లాక్‌చెయిన్‌ విభాగాల్లోని అంకురాలకు టి-ఫండ్‌ ద్వారా నిధులు అందించేందుకు వీసీలతో కలిసి పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1,800 అంకురాలకు టి-హబ్‌ ద్వారా పలు రకాల ప్రోత్సాహకాలు లభించాయని తెలిపారు. దాదాపు రూ.2,269 కోట్ల పెట్టుబడుల సమీకరణలో టి-హబ్‌ తోడ్పాటు ఉందన్నారు. ఫేస్‌బుక్‌, ఉబర్‌, హెచ్‌సీఎల్‌, బోయింగ్‌, మైక్రోసాఫ్ట్‌, క్వాల్‌కాం లాంటి 600 కార్పొరేట్లతో టి-హబ్‌కు ఒప్పందాలున్నట్లు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని